Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : 200 యూనిట్లలోపు ఏ కుటుంబం వారు వాడుకున్నా, వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు వాడుకుంటున్న వారిని ప్రభుత్వం ఎంపిక చేయలేదు. గ్రామమసభలు పెట్టి, ఆ గ్రామసభల్లో రేషన్ కార్డు జతచేసి ప్రజలందరినీ దరఖాస్తు చేసుకొవాలని చెప్పడం జరిగింది. అలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నాం. అర్హతకలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచచ్చు. ఇదొక నిరంతరంగా జరిగే కార్యక్రమమని అన్నారు.
Reporter
Telugu Rekha Media