Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : వర్షాకాలం దృష్ట్యా నాలాల విస్తరణ పనులను త్వరతగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నాలాల విస్తరణ పనులు, నయీమ్ నగర్ వంతెన నిర్మాణ పనుల పురోగతి, చెరువు శిఖముల ఆక్రమణలు, తదితర అంశాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో పాటు రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సాగునీటి పారుదల, కుడా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నాలాల విస్తరణ పనుల విషయంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నాలాల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తయ్యేవిధంగా అధికారులు కృషి చేయాలన్నారు. నయీమ్ నగర్ వంతెన నిర్మాణ పనుల పురోగతి పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా నాలాల విస్తరణ, నయీమ్ నగర్, ఇతర అభివృద్ధి పనులపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో హన్మకొండ ఆర్డీవో వెంకటేష్, జీడబ్ల్యూఎంసీ అధికారులు రాజయ్య, ప్రవీణ్ చంద్ర, శంకర్ లింగం, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, సీఎంహెచ్వో డాక్టర్ రాజేష్,టౌన్ ప్లానింగ్ సీపీవో వెంకన్న, సాగునీటిపారుదల శాఖ అధికారులు వెంకటేశ్వర్లు, సీతారాం, హర్షవర్ధన్, డీఐవో రాంమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media