Wednesday, 29 July 2026 02:56:24 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఇలాంటి తీర్మానం ప్రవేశ పెట్టాల్సి వచ్చినందుకు బాధగా ఉంది...

-- కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ లాస్య నందిత మృతికి సిఎం రేవంత్ రెడ్డి సంతాపం.

Date : 23 July 2024 11:57 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ శాసన బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. శాసన సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎంఎల్‌ఎ లాస్య నందిత మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చాలా చింతిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. లాస్య నందిత తండ్రి, దివంగత ఎంఎల్‌ఎ సాయన్న తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని, చాలా సంవత్సరాలు ఇద్దరం ప్రజాప్రతినిధులుగా కలిసి పని చేశామని, సాయన్న 1951లో నిజమాబాద్ జిల్లా వల్లభానగర్ లో అత్యంత సామాన్యమైన కుటుంబంలో సాయన్న జన్మించారని, జీవితంలో కష్టపడి ఐదుసార్లు ఎంఎల్ఎగా గెలిచి కంటోన్మెంట్ ప్రజలకు సేవలందించారని ప్రశంసించారు. ఆయన కంటోన్మెంట్ నిజయోకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు సాయన్న కన్నుమూయడంతో లాస్య నందిత తన తండ్రి వారసత్వాన్ని, బాధ్యతలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయన బతికి ఉన్నప్పుడే ఆమె కార్పొరేటర్ గెలిచారని, లాస్య నందిత ఎంఎల్‌ఎగా గెలిచిన తరువాత కంటోన్మెంట్ ప్రజలు, మహిళల తరఫున చిత్తశుద్ధితో పోరాడుతున్న తరుణంలో ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం దురదృష్టకరమైన విషయమని బాధను వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్యనందిత శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. ఆమె మృతి పట్ల రేవంత్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: