Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : మంథని మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి రహదారిని ఆనుకొని ఉన్న పోచమ్మ దేవాలయా భూములను భూ కబ్జాదారుల నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. పోచమ్మ గుడి మాన్యానికి సంబంధించిన బొక్కల వాగును ఆనుకుని ఉన్న భూమిని కొంతమంది రాజకీయ అండదండలతో కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీంతో బోయిన్ పేట కు చెందిన తెలుగు గూడెం, గొల్లగూడెం,దుబ్బగూడెం, గంగాపురి గ్రామాలకు చెందిన వివిధ కులాలకు చెందిన ప్రజలు స్పందించి పోచమ్మ దేవాలయానికి సంబంధించిన భూమిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను సోమవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా మంథని మత్స్య సహకార సంఘం మంథని అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ మాట్లాడుతూ తరతరాలు గా బోయిన్ పేటలోని తెనుగు గూడెం, గొల్లగూడెం, దుబ్బ గూడెం, గంగాపురి మరియు మంథని ప్రజలు ఈ పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారని, ఎటువంటి శుభకార్యాన్ని అయినా మొట్ట మొదలుగా పోచమ్మ కొలుపుతో మొదలుపెట్టి ప్రతి యేట వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అతి పవిత్రంగా చూసుకునే ఇటువంటి స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడం చాలా దారుణం అన్నారు. మంథని లో ఇటువంటి ప్రయత్నాలు చెల్లనేరవని బోయినపేట కు సంబంధించిన కుల పెద్దలు వెంటనే ఆ కార్యక్రమం పైన తీవ్ర స్థాయిలో మండి పడి ఈ భూ కబ్జాను ఆపడం జరిగిందన్నారు. ఇకమీదట ఎవరైనా గుడి జోలికి వచ్చిన గుడి స్థలాల జోలికి వచ్చిన సహించేది లేదని అన్నారు.ఎంతటి వారినైనా పోచమ్మ బలి తీసుకుంటుందని ఇకమీదట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ గుడి మాన్యానికి ప్రహరీ గోడ నిర్మించాలన్నారు. వనభోజనాలకు నిర్వహించుకునేందుకు తగిన సౌకర్యాలను కల్పించాలని, చెట్లను పెంచడం నీటి వసతి ఏర్పాటు చేసి పోచమ్మ గుడి అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రచించాలని సంబంధిత అధికారులను కోరారు. వెంటనే దేవాలయ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అన్ని కులాల పెద్దలు పోతరవేని లక్ష్మిరాజం(అర్జున్), సబ్బని సమ్మయ్య,పొలు కనకరాజు,గుండా రాజు,కుంట బద్రి,మబ్బు నాగరాజు,పర్శవెన ఓదెలు, ఆర్కె రాజు,పర్శేవెన మోహన్,బంగారు మధునయ్య,మోసం కొమురయ్య,అంబటి కొమురయ్య,మోసం నర్సయ్య,అంబటి సత్తన్న,అంబటి నర్సింగ్,బత్తుల సత్యనారాయణ,బూర్ల శ్రీనివాస్,నల్లి శంకర్,నల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media