Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : పార్లమెంట్ ఎకనామిక్ సర్వే అఫ్ ఇండియా బూక్ లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్..ప్రతి యేటా వెలువరించే బుక్ లో దేశం లోని ప్రత్యేక కార్యక్రమాలు. 2023-24 బుక్ లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ గురించి ప్రచురణ.ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తీసుకున్న అద్భుతమైన. గొప్ప కార్యక్రమం స్టీల్ బ్యాంక్ అని కొనియాడిన ఎకానమిక్ బుక్ అఫ్ ఇండియా.సిద్దిపేట స్టేల్ బ్యాంక్ దేశం మొత్తం అమలు.సిద్దిపేట కీర్తి ని జాతీయ స్థాయి లో నిల్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇది సిద్దిపేట ప్రజల భాగస్వామ్యం తోనే సాధ్యం. సిద్దిపేట ప్రజలకు శుభాకాంక్షలు.సిద్దిపేట అన్నింటి లో ఆదర్శం దేశం లో అవార్డు వచ్చిందంటే సిద్దిపేట పేరులేనిది ఉండడు సిద్దిపేట లో ఏ కార్యక్రమం తలపెట్టిన దేశ, రాష్ట్ర స్థాయిలో అమలు కావాల్సిందే. సిద్దిపేట ను చూసి నేర్చునకొని పోయినా దేశాలు రాష్ట్రాలు రాష్ట్రం లోని జిల్లాలు నియోజకవర్గంలు ఎన్నో ఉన్నాయ్..మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చూపిన చొరవ తో నె సాధ్యం అయింది.గతం లో ఒక మారు మూల గ్రామం అయిన ఇబ్రహీంపూర్ లో ఇంకుడు గుంతల కార్యక్రమం చేపడితే దేశ విదేశాల మన్నలని పొందింది అదే స్ఫూర్తి తో ఎన్నో కార్యక్రమాలకు సిద్దిపేట వేదిక అయింది. అందులో భాగంగా సిద్దిపేట లో స్టీల్ బ్యాంక్ అనే కొత్త వినూత్న కార్యక్రమం ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తను మంత్రి హోదా లో ప్రారంభించారు. సిద్దిపేట ప్లాస్టిక్ రహిత సిద్దిపేట గా మారాలి అని ప్రజల్లో గొప్ప చైతన్యం తెచ్చారు. భారతన మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్ సిద్దిపేట ప్లాస్టిక్ రహిత పట్టణం గా మార్చే లక్ష్యంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీసుకున్న వినూత్న కార్యక్రమం వార్డ్ వార్డ్ నా స్టీల్ బ్యాంక్. ఈ స్టీల్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశ్యం వార్డ్ లో ప్రజలు ప్లాస్టిక్ గ్లాస్ లు ప్లాస్టిక్ ప్లేట్స్ వాడొద్దు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఈ స్టీల్ బ్యాంక్ నుండే తీసుకపోవాలి అప్పుడే ప్రజలు ఆరోగ్యం గా ఉంటారు. ప్లాస్టిక్ రహిత ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట పట్టణం లో 43వార్డ్ లకు 34 వార్డ్ ల్లో పూర్తి కాగా. ఇదే స్ఫూర్తి తో గ్రామీణ ప్రాంతాలకి సాగింది. అందుకె దేశం లోనే ఇంత గొప్ప కార్యక్రమం. ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఇక్కడి పాలకులు ప్రజలు స్టీల్ బ్యాంక్ కార్యక్రమం తీసుకోవడం అద్భుతం అని కేంద్రం మెచ్చింది. ప్రతి యేటా విలువరించే పార్లమెంట్ ఎకనామీక్ సర్వే అఫ్ ఇండియా బుక్ లో" సిద్దిపేట స్టీల్ బ్యాంక్ " గొప్ప కార్యక్రమం అద్భుతం అని కొనియాడారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా దేశం లో ఉండే ప్రత్యేక కార్యక్రమాలు బుక్ లో ప్రచురణ చేస్తారు. అందులో భాగంగా మన సిద్దిపేట స్టీల్ బ్యాంక్ ను ఆ బుక్ లో ప్రచురణ చేశారు ఈ స్టీల్ బ్యాంక్ స్ఫూర్తి దేశం మొత్తం అమలు పరుస్తాం అని ప్రచురణ లో తెలిపారు.
చేసే పనుల్లో సార్థకత వచ్చినపుడు గొప్ప సంతృప్తి.. సిద్దిపేట ప్రజలకు అధికారులకు అభినందనలు.. శుభాకాంక్షలు.. సంతోషం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు... ఒక పని మొదలు పెట్టినప్పుడు అవుతుందా కదా అనే ఆలోచన తో మొదలు పెడతాం. సిద్దిపేట ప్రజల అదృష్టం సిద్దిపేట లో ఏ కార్యక్రమం తలపెట్టిన సిద్దిస్తుంది. ఫలిస్తుంది ఫలితం ఇస్తుంది అనే నమ్మకం ఎంతో ఉంది అందుకు ఎన్నో కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎకానమిక్ సర్వే అఫ్ ఇండియా బుక్ లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ చాలా మంచి కార్యక్రమం అని ప్రచురణ చేయడం. జాతీయ స్థాయి లో మరో రికార్డ్ లో సిద్దిపేట ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. ఒక ప్రజాప్రతినిదిగ ఒక పని చేయడం ఎంత గొప్ప నో. ఆ పనిని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఫలితం రావడం అంత గొప్ప సంతృప్తి ఉంటుంది అని హరీష్ రావు అన్నారు. జాతీయ ఖ్యాతిలో సిద్దిపేట మరో సారి నిలవడం సిద్దిపేట ప్రజల భాగస్వామ్యమని ఈ సందర్బంగా సిద్దిపేట ప్రజలకు అధికారులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Telugu Rekha Media