Saturday, 13 June 2026 08:30:55 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే...

ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు. -- పోలీస్ కమిషనర్..

Date : 28 June 2024 10:06 PM

Telugu Rekha Media - తెలంగాణ / ఖమ్మం : ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. నగరంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 45 మంది ద్విచక్ర వాహనదారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే నిందుతులు పోలీసుల నుండి సీసీ కెమెరాల నుండి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనాల నెంబరు ప్లేట్ లను తొలగిస్తున్నారని అన్నారు. అదేవిధంగా చోరి చేసిన వాహనాలతోనే ఎక్కువ నేరాలు చేస్తున్నారని పెర్కొన్నారు. దొంగిలించిన వాహనాలు నకిలీ పత్రాలు సృష్టించి తక్కువ ధరలకు విక్రయిస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వ్యక్తులు వాహనాలు కొనుగోలు, అమ్మకాలు చేసినట్లతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మార్పు చేసుకోవాలని లేదంటే ఎదైనా నేరాలలో మీ వాహనాలు వున్నట్లు గుర్తిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి జరిమానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ ను వంచినా, ముగుసు వేసినా, పూర్తిగా లేకుండా చేసిన వారని గుర్తించి వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు.

ప్రస్తుతం నంబర్ లేకుండా పట్టుబడిన వాహన పత్రాలు, చాయిస్ నెంబర్లు తనిఖీ చేయాలని, అలాగే చోరికి గురైన వాహనాలు ఏమైనా వున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు. ఇకపై నెంబర్ ప్లేట్ తారుమారు చేసినా, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎక్కడ పడితే అక్కడ సీజ్ చేయాలని ఈ మేరకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని, నంబర్ ప్లేట్లను బిగించిన తర్వాతే వాహనాలను ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ పై మరింత దృష్టి పెట్టాలని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా ఎంవీ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తామని, ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే జైలు శిక్ష, లేదా జరిమానా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సిఐ మోహన్ బాబు, ఎస్సై రవి, సాగర్ పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :