Saturday, 13 June 2026 06:56:27 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అందుబాటులో ఉండి సేవలందించాలి...

-- ముస్తాబాద్, పోత్గల్ పీఏసీఎస్ ల తనిఖీలో జిల్లా కలెక్టర్. -- సకాలంలో స్పందించి పాపను దవాఖానకు తరలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

Date : 12 July 2024 08:56 PM

Telugu Rekha Media - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : వైద్యులు అందుబాటులో ఉండి.. సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేటలోని సీహెచ్ సీని, శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఐపీ, లేబర్ రూం, ఫార్మసీ, ల్యాబ్ టాయిలెట్స్ ప్రహరీ, జనరేటర్, డ్రైనేజీ పరిశీలించి, వైద్యులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కేసులు వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంకా కావాల్సిన వసతుల పై ఆరాతీశారు. ఆయా పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్, పోత్గల్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పీఏసీ ఎస్. లలో ఈ - పాస్ యంత్రాలను, నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు. ఎరువులు ఎంత ధరకు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా స్టాక్ ఉండాలని ఆదేశించారు. పీఏసీఎస్. పరిశీలన అనంతరం కలెక్టర్ తన వాహనంలో వెళ్తుండగా ఒక పాపతో మహిళ వాహనానికి అడ్డుగా వచ్చారు. దీంతో కలెక్టర్ వాహనం నుంచి వెంటనే దిగి ఆమె వివరాలు అడిగారు. తన పాపకు తీవ్రమైన జ్వరం వచ్చిందని అలాగే ఫిట్స్ కూడా ఉన్నాయని సహాయం అందించాలని వేడుకోగా, స్పందించిన కలెక్టర్ వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి తరలించారు. అక్కడే కొద్ది సమయం ఉండి వైద్యులతో మాట్లాడారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు, పాప జ్వరం, ఫిట్స్ తో బాధపడుతుందని వైద్యులు తెలిపారు. సకాలంలో కలెక్టర్ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించడంతో పాపకు ప్రాణా పాయం తప్పింది. ఈ పర్యటన లో డీసీహెచ్ ఎస్. మురళీధర్ రావు, డాక్టర్లు శ్రీనివాస్, సిందూజ, నర్సులు, సిబ్బంది, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :