Thursday, 30 July 2026 04:55:08 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సిద్దిపేట సాగు నీటి కల సాకారం అయింది మీ హయాంలోనె...

-- మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.

Date : 02 July 2024 10:25 AM

Telugu Rekha Media - తెలంగాణ / ఆదిలాబాద్ : చరిత్ర లో నిలిచే పనులు ఎన్నో చేసిన ఘనత మీకె దక్కుతుంది. పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవా ఎల్లప్పుడూ ఉంటుందని చిన్నకూడూర్ మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.హరీష్ రావు మాట్లాడుతూ చిన్నకోడూరు మండల పరిషత్ చివరి సర్వ సభ్యసమావేశం జరుపుకుంటున్నాం. మీరందరూ గత 5 సంవత్సరాలుగా కష్టపడి ప్రజలకు మీ సేవలను అందించారు. సర్పంచ్ లు ఎంపీటీసీ లు కలిసి చాల గ్రామాల్లో సమన్వయంతో పని చేశారు. కాళేశ్వరం నీళ్లను రైతులకు రెండు పంటలకు అందించిన గొప్ప అవకాశం మీ హయాంలో మీకు దొరికింది. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటాం. కానీ సాగునీరు మనకు జీవన ఆధారం. జీవన గతిని, పల్లెల ముఖ చిత్రాన్ని మార్చేది సాగు నీరు. అలాంటి సాగునీరు మీ ఈ అయిదేళ్ల కాలంలో రైతులకు అందడం మీ అదృష్టం. గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలు బాగుచేసుకున్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఇలా అనేక అభివృద్ధి పనులు మీ హయాం లో చేసుకున్నాం. అభివృద్ధి అక్కడితో ఆగదు. ఎంత చేసుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇంకా పనులు మిగిలే ఉంటాయి. పదవుల్లో ఉన్నపుడు ఎన్ని మంచి పనులు చేశామనేదే శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి మీకు మళ్లీ ఇంకా మంచి అవకాశాలు రావలని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కోరుకుంటున్నాను. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందే. అధికారంలో ఉన్నా లేకపోయినా నా సహకారం ఎప్పడికి మీకు ఉంటుంది. ఇలాగే ఎప్పుడు మీరు ప్రజల్లో ఉంటూ, ప్రజా సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తున్నానని అన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: