Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం ఆని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు..విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఏఎస్ఐ లు ప్రభాకర్ రెడ్డి, హసన్ మహమ్మద్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు..బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు.ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిచారు.అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(ఎఆర్) భీమ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్, వేణు, పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media