Saturday, 13 June 2026 07:06:43 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సహకార సంఘాల ద్వారానే మెరుగైన భవిష్యత్తు...

-- మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

Date : 06 July 2024 02:10 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : సహకార సంఘాల ద్వారానే మెరుగైన భవిష్యత్ నిర్మించవచ్చని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో శనివారం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో సహకార ఉద్యమం వ్యాప్తి చెందిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ కమిటీ ఫర్ ప్రమోషన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్స్ సంయుక్తంగా జెనీవా దేశంలో జూలై నెల 1995వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఇంటర్నెషనల్ కో ఆపరేటివ్ అలయన్స్ వారు కో ఆపరేటివ్ ఉద్యమం అభివృద్ధి సమీక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. చిన్న వ్యాపార సంస్థల నుండి బడా వ్యాపార సంస్థల వరకు, మత్స్య, పాల ఉత్పుత్తులు, ఫిషరీస్, మొదలగు వాటిని ప్రోత్సహిస్తూ సహకార రంగాన్ని బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. అంతేగాకుండా సహకార సంఘాల ద్వారా రైతులకు పంట పెట్టుబడుల కోసం రుణాలు ఇవ్వడంతో పాటు ఎరువులు విత్తనాలు, పెస్టిసైడ్స్, మినరల్ వాటర్, తదితర సేవలను అందిస్తున్నాయని అన్నారు. భారత అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నాయని ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సహకార రంగ అన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాపు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దేవళ్ల విజయ్ కుమార్, దాసరి లక్ష్మీ-మొండయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమ-సురేష్ రెడ్డి, తాజా మాజీ ఎంపిపి కొండ శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీంఖాన్, నాయకులు మంథని విజయ్ కుమార్, బెజ్జంకి డిగంబర్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :