Telugu Rekha Media - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ వ్యాప్తంగా 42 మందికి ఇతర పెన్షన్ పొందుతూ 2017 నుండి ఆసరా పెన్షన్ పొందిన వృద్ధులు వితంతువులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్ 2000 రూపాయలని వారు వాడుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వృద్ధులపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పునరాలోచనచేసి, ఆ ఉత్తర్వులను రద్దు పరచుకోవాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధాప్య, వితంతు పెన్షన్లు కొంతమంది వృద్ధులు వితంతులు ఒక పెన్షన్ ఉండి రెండవ ఆసరా పెన్షన్ పొందుతున్నవారు ఇప్పటివరకు వారు వాడుకున్న 1,72,900 పైచిలుకు సొమ్ము తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఇచ్చిన ఉత్తర్వులతో వృద్ధులు, వితంతులు మానసిక ఆందోళన గురవుతున్నారని మునిగడప పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు వారి కుటుంబ అవసరాల రిత్య, బిపి, షుగర్ తదితర జబ్బులకు వచ్చిన రెండు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారని తిరిగి అలాంటి పేద, మధ్యతరగతి వారు డబ్బులు చెల్లించమంటే ఎలా చెల్లిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కొంతమంది రెండో పెన్షన్ వద్దని స్వచ్ఛందంగానే గత కొన్ని నెలల నుండి పెన్షన్ తీసుకోవడం మానేశారని, కానీ వారు ఇప్పుడు గతంలో వాడుకున్న సొమ్ము మొత్తం తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు అందించడంతో వారు ఆందోళన చెందుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులపై పునర్ప రిశీలన చేసి ఉత్తర్వులను రద్దుచేసి వృద్ధులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Reporter
Telugu Rekha Media