Wednesday, 15 April 2026 02:58:34 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మద్యం మత్తులో కారు డ్రైవింగ్...

-- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.

Date : 15 July 2024 10:59 AM

Telugu Rekha Media - తెలంగాణ / నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని దాస్ నగర్ వెళ్లే మార్గంలో తాగి అతివేగంగా కారు నడుపుతూ నడుచుకుంటూ వెళ్తున్న వారిని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో పద్మ(35), పోచవ్వ(64) అక్కడికక్కడే మృతి చెందారు. మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రిషికా, ఇంటర్మీడియట్ విద్యార్థినిలకు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రిషికా పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను రెండవ ఆదివారం తల్లిదండ్రులు చూడడానికి వస్తారు. ఈ క్రమంలో వారిని అవుటింగ్ తీసుకువెళ్లి తినిపించి తిరిగి పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు నడుపుతున్న సతీష్ నిజామాబాద్ ఆర్టీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న సతీష్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సంఘటన స్థలాన్ని సీఐ సుధీర్ రావు తో పాటు ఎస్ఐ సతీష్ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను స్థానికులు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :