Thursday, 30 July 2026 06:47:04 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సీజన్ వ్యాధులపై అప్రమత్తం...

-- సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్.

Date : 10 July 2024 12:24 PM

Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : వర్షాకాలం దృష్ట్యా జిల్లా లో సీజనల్ వ్యాథులు భారిన పడకుండా ప్రతి ఒక్కరినీ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమీటి సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షత జరిగింది. ముందుగా ప్రోగ్రామ్ర్ ఆఫీసర్ డాక్టర్. విజయ రాణి వర్షకాలం లో ఎదుర్కునే చర్యల గూర్చి క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామములో ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటు చేయాలని, ఎవరికైనా డయేరియా తో బాధపడుతున్నట్లయితే వెంటనే తగు చర్యలు తీసుకొని ఎలాంటి ప్రాణహాని లేకుండా కాపాడాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. అన్ని అంగన్వాడి కేంద్రాల్లో మరియు పాఠశాలలో వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత ముఖ్యంగా చేతుల శుభ్రత పైన వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడి కేంద్రాల్లో పాఠశాలలో, జీపి లో తగినన్ని ఓఆర్ఎస్ మరియు జింకు టాబ్లెట్లు అందుబాటులో ఉంచాలి. జిల్లాలో రక్షిత మంచినీరు సరఫరా చేసే విధంగా సంబంధిత నీటిపారుదల శాఖ వారు చర్యలు తీసుకోవాలని అలాగే క్లోరినేషన్ ప్రక్రియ సైతం పర్యవేక్షణ చెయ్యాలి. ఆశా కార్యకర్త గ్రామంలో డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి లైన్ లిస్టును సిద్ధం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారికి, ఎమ్మార్వో ఎంపీడీవో, ఇవ్వాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ లలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాకాలంలో సాధారణంగా అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నది కాబట్టి అందులో ప్రధానంగా డయేరియా ఎక్కువైతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డయేరియా లక్షణాలు ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే వారిని ఉన్నతమైన ప్రభుత్వ దవాఖానకు పంపాలి. ప్రతి ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు ప్రతి ఒక్కరూ ఈ డయేరియాను అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు . ఈ కార్యక్రమము ఆగస్టు 31 వరకు నిర్విరామంగా జరుగుతుందని తెలిపారు. డయేరియా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా తగిన చికిత్సలు తీసుకొని ఆరోగ్యంగా ఉండేటట్లు సహకరించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: